సౌదీలో గొర్రెల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు

రక్షించి ఇండియాకు తీసుకురావాలని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులుసంబంధిత అధికారులను ఆదేశించిన సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డా. జి. చిన్నారెడ్డిరియాద్, మే 9: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు సుమారు 950 కి.మీ దూరంలోని ఎడారి ప్రాంతంలో గొర్రెల కాపరిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బట్టు బట్టం రాజ్‌పల్లి (బీబీ రాజ్‌పల్లి) గ్రామానికి చెందిన దాసరి అరవింద్ (23)ను రక్షించి స్వదేశానికి తీసుకురావాలని, మోసం చేసిన ఎజెంట్‌పై చర్యలు తీసుకోవాలని అతని తల్లి రాజవ్వ శుక్రవారం...