అల్ హాసలో కామ్రేడ్ డాక్టర్ సురేష్‌కు ఘన నివాళి

సౌదీ అరేబియా : అల్ హాస నగరంలో సాటా ఈస్టర్న్ రీజియన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ డాక్టర్ సురేష్ గారికి ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. మార్చి 14న విజయవాడలోని కృష్ణా నదిలో ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు మునిగి ఆయన మరణించిన విషయం తెలిసిందే.డాక్టర్ సురేష్ గారు సాటా ఈస్టర్న్ రీజియన్ తొలి సమావేశం అయిన జూన్ 4, 2022 నుంచి గత సంవత్సరం వరకు సంస్థ నిర్వహించిన సోషల్ సర్వీస్ కార్యక్రమాలు, మెడికల్ అవగాహన కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొని సేవలందించారు. ఆయన సేవలను...