📳 మే 2న దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లలో సైరన్ అలర్ట్ – భయపడాల్సిన అవసరం లేదు: కేంద్రం స్పష్టం

న్యూఢిల్లీ: రేపు (మే 2, 2026) దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి పెద్ద సైరన్ శబ్దం వినిపించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇది అత్యవసర పరిస్థితి కాదని, కేవలం పరీక్ష (టెస్ట్) మాత్రమేనని ప్రజలకు స్పష్టంచేసింది.భవిష్యత్తులో వరదలు, తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను తక్షణమే అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం ‘SACHET’ (సాచెట్) అనే అత్యవసర హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టెలికమ్యూనికేషన్ శాఖ మరియు జాతీయ...