ADB : భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్ …
ఆదిలాబాద్, ఏప్రిల్ 30:భర్త వేధింపులు తట్టుకోలేక భార్య అతడిని హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ కె. ఫణిధర్ తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ సీఐ కె. ఫణిధర్ 📌 ఘటన వివరాలుపోలీసుల వివరాల ప్రకారం, ఉట్నూర్ హరిజనవాడకు చెందిన సోలంకి గణపతి (54) మరియు అతని భార్య సోలంకి మధురాబాయి (52) కమ్మరి వృత్తితో జీవనం సాగించేవారు. జీవనోపాధి కోసం వారు ఊరూరా తిరుగుతూ పని చేసేవారు....