రియాద్‌లో ఘనంగా సీఎం N. Chandrababu Naidu 75వ జన్మదిన వేడుకలు
Riyad , Andhra : సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో NRI TDP టీం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో చిన్నారుల చేతుల మీదుగా కేక్ కట్ చేయించి సంబరాలు జరిపారు. కార్యక్రమానికి తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి), మహేంద్ర వాకాటి,...