సౌదీ అరేబియాలో తెలుగు టైలర్స్ అసోసియేషన్ (TTA) హైల్‌లో ఘన ప్రారంభం

హైల్, సౌదీ అరేబియా | రిపబ్లిక్ హిందుస్థాన్:సౌదీ అరేబియాలో పనిచేస్తున్న తెలుగు టైలర్ల ఐక్యత, అభివృద్ధి మరియు పరస్పర సహకారాన్ని లక్ష్యంగా చేసుకుని తెలుగు టైలర్స్ అసోసియేషన్ (TTA) హైల్ నగరంలో ఘనంగా ప్రారంభించబడింది.ఈ కార్యక్రమానికి తెలుగు సమాజ సభ్యులు, టైలరింగ్ వృత్తి నిపుణులు, వ్యాపారవేత్తలు, కుటుంబ సభ్యులు, మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు, పశ్చిమ గోదావరి జిల్లా భగ్గేశ్వరం గ్రామానికి చెందిన శ్రీ చెల్లబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఈ సంఘం తెలుగు టైలర్ల ఐక్యతకు బలమైన...