అమరావతి, రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్ సభ మరియు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు NRI TDP, Saudi Arabia టీం సభ్యులు సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి), మహేంద్ర వాకాటి, మోహన్ గురజాల, శివ దబ్బకూటి, హరీష్, రవి మేడూరి, మధు తదితరులతో పాటు మహిళా సభ్యులు శ్రీదేవి వాకాటి, జ్యోతి, విద్య, మణి, శిరీష పాల్గొన్నారు. అలాగే జనసేన అభిమానులు రాంబాబు బండి, ప్రగతి మరియు ఇతర టీడీపీ అభిమానులు కూడా హాజరై “జై అమరావతి, జై జై అమరావతి” నినాదాలతో ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.

ఒక చిన్న పిలుపుతోనే ఇంతమంది ముందుకు వచ్చి, ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చిన సందర్భంగా సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రం, ప్రాంతం, పార్టీ అనే భేదాలు లేకుండా టీడీపీ మరియు జనసేన అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. గత ఐదు రోజుల వ్యవధిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండు కార్యక్రమాలలో అభిమానులు భారీగా పాల్గొనడం చూసి ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజల్లో టీడీపీపై ఉన్న అభిమానము రోజురోజుకు పెరుగుతుందని కార్యక్రమ నిర్వాహకులు తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి) తన ఆనందాన్ని పంచుకున్నారు.