గజదొంగ మొయిజ్‌పై పీడీ యాక్ట్ నమోదు
ఆదిలాబాద్, రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గజదొంగ మొయిజ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ (Preventive Detention Act) నమోదు చేశారు. నిందితుడు గత దాదాపు 15 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ, ఇప్పటివరకు సుమారు 70 దొంగతనం కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం, మొయిజ్‌పై 2019లో కూడా పీడీ యాక్ట్ కింద కేసు నమోదు కాగా, సంవత్సరం పాటు జైలులో ఉన్నాడు. విడుదల అనంతరం ప్రవర్తనలో...