గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి – సాటా రియాద్ డిమాండ్
హైదరాబాద్, మార్చి 29: గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధిని కేటాయించాలని సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ ప్రభుత్వాన్ని కోరారు. ఎడారి ప్రాంతాల్లో తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తూ కుటుంబాల పోషణ కోసం కష్టపడుతున్న గల్ఫ్ కార్మికుల పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.విదేశాల్లో శ్రమిస్తూ దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్న కార్మికులు, సమస్యలు ఎదురైనప్పుడు సరైన సహాయం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వారికి ఆర్థిక...