సాటా ఆధ్వర్యంలో సౌదీ అరబియా రియాద్ లో ఘనంగా ఉగాది మరియు ఈదు మిలాప్ ఉత్సవాలు
హిందుస్థాన్ , సౌదీ అరేబియా ప్రతినిధి : రియాద్ నగరంలో సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాటా) ఆధ్వర్యంలో ఉగాది & ఈద్ వేడుకలు ఎంతో వైభవంగా, ఆనందోత్సాహాలతో నిర్వహించబడ్డాయి.విదేశాల్లో నివసిస్తున్న భారతీయులమైన మనకు మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసే ఈ వేడుకలు ప్రతి ఒక్కరికీ ఆత్మీయ అనుభూతిని కలిగించాయి. కుటుంబ సభ్యులు, పిల్లలు, యువత కలిసి ఒకటిగా పాల్గొని ఉగాది పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముఖ్య ఆకర్షణలు:సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వినోద కార్యక్రమాలు అందరికీ ఉత్సాహాన్ని...