అల్ ఖోబార్‌లో ఘనంగా ‘ఉమెన్స్ ఫెస్టివల్ ఆఫ్ క్రికెట్ 2026’.. వెల్లువెత్తిన క్రీడాభిమానం

అల్ ఖోబార్, సౌదీ అరేబియా (జనవరి 30): సౌదీ అరేబియా తూర్పు ప్రాంతం అల్ ఖోబార్‌లోని స్పోర్ట్స్ సిటీ (స్పోర్ట్స్ యార్డ్) వేదికగా జనవరి 30న 'ఫెస్టివల్ ఆఫ్ క్రికెట్ - ఉమెన్స్ ఎడిషన్ 2026' అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. గ్లోబల్ ఇండియా సౌదీ అరేబియా (GISA) ఆధ్వర్యంలో, సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ (SACF) సహకారంతో నిర్వహించిన ఈ టోర్నీలో ఏకంగా 23 జట్లు, 255 మంది రిజిస్టర్డ్ మహిళా క్రీడాకారిణులు పాల్గొన్నారు. మహిళల క్రికెట్ పట్ల పెరుగుతున్న ఆదరణకు ఈ...