ప్రవాస భారతీయుల సంక్షేమంపై ఇండియన్ ఎంబసీ అధికారులతో GIO రియాద్ బృందం చర్చలు
రియాద్, మార్చి 8: సౌదీ అరేబియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సంక్షేమం మరియు వారికి అందించే సహాయక సేవలపై చర్చించడానికి గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజేషన్ (GIO) రియాద్ ప్రతినిధుల బృందం రియాద్‌లోని భారతీయ రాయబార కార్యాలయ (ఇండియన్ ఎంబసీ) అధికారులను కలిసింది.ఈ సమావేశంలో, సామాజిక సేవలు, కమ్యూనిటీ సంక్షేమం, యువత అభివృద్ధి, మహిళా సాధికారత, ఉపాధికి మద్దతు మరియు డిజిటల్ అక్షరాస్యత రంగాలలో GIO చేపడుతున్న కార్యక్రమాలను ప్రతినిధుల బృందం అధికారులకు వివరించింది. GIO లాంటి సంస్థల కృషిని ఎంబసీ అధికారులు ప్రశంసించారు. సౌదీ...