పేదింటి (ఆంద్ )తెగ గిరిజన బిడ్డకే ఐటీడీఏ చైర్మన్ పదవిదక్కాలి కాంగ్రెస్ తరఫున డిమాండ్ : జల్కే పాండురంగ్‌కు మద్దతు వెల్లువ.

రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్  హత్నూర్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ చైర్మన్ పదవి అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన ఈ పదవిని ఒక ఆదివాసీ బిడ్డకే కేటాయించాలని డిమాండ్ బలపడుతోంది. ఈ నేపథ్యంలో బజార్ హత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ జల్కే పాండురంగ్‌కు మద్దతుగా నాయకులు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ కి మంగళవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జల్కే పాండురంగ్  ఆదివాసీ కుటుంబానికి చెందినవారని,...