వైభవంగా ముగిసిన దివ్య శ్రీ గో కృప కథ.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు
ఇచ్చోడ/మాధాపూర్, (తేదీ: 15-02-2026) : ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం, మాధాపూర్ గ్రామంలోని శ్రీ ప్రతి భగవాన్ గఢ్‌లో గత వారం రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న 'దివ్య శ్రీ గో కృప కథ' సప్తాహ జ్ఞాన యజ్ఞం ఆదివారం (నేడు) ఘనంగా ముగిసింది. మహంత్ న్యాయాచార్య హ.భ.ప. నామ్‌దేవ్ శాస్త్రి మహారాజ్ గారి కృపాశీర్వాదములతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తి పారవశ్యంలో మాధాపూర్:గత ఏడు రోజులుగా (ఫిబ్రవరి 9 నుండి 15 వరకు) పూజ్య సాధ్వి కపిలా గోపాల్ సరస్వతి దీదీజీ తన...