– సరిహద్దు ప్రాంతాల్లోనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ గురుస్వామి
ఆదిలాబాద్ /బోథ్ : తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకా దయాల్ దన్నూర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు తేది:10.02.2026 రాత్రి 10.00 నుంచి 11.00 సమయంలో మొక్క జొన్న పంటకు నీరు అందించేందుకు పొలానికి వెళ్లారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న సర్వే నం.89 వ్యవసాయ భూమిలో ఎలుగుబంటి దత్త బలిరాం జాదవ్ వయస్సు.55 గ్రామం. దయాల్ దన్నూర్ పై దాడి చేసింది. గ్రామానికి చెందిన మరో 8 మంది రైతును కాపాడటానికి వెళ్ళిన సమయంలో అందరి పై దాడి చేసింది. నలుగురు తీవ్రంగా గాయపడగా వారిలో ముగ్గురిని నాందేడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో, ఒకరిని సంబాజీ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బోథ్ మండలంలోని సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతానికి వెళ్ళవద్దని సూచిస్తున్నాం. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల ప్రజలు ఏదైనా ప్రమాదం అనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలి.