ఉట్నూర్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గజదొంగ అరెస్ట్: 11.4 తులాల బంగారం స్వాధీనం
ఆదిలాబాద్, రిపబ్లిక్ హిందుస్థాన్: ఉట్నూర్ మండల పరిధిలో వరుస రాత్రి దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న గజదొంగను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ కేసు వివరాలను వెల్లడించారు. నేపథ్యం మరియు అరెస్ట్ వివరాలు:ఉట్నూర్ మండలానికి చెందిన టేకం రామారావు అలియాస్ తుకారం (40) పాత నేరస్తుడు....