ఇచ్చోడాలో బీఆర్ఎస్ రాస్తారోకో – కేసీఆర్‌పై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఇచ్చోడా మండలంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని వారు ఆరోపించారు.కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గులాబీ సైన్యం హెచ్చరించింది. పాలనలో వైఫల్యంతో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌పై కేసులు, నోటీసుల పేరిట వేధింపులు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ...