నిరుద్యోగులపై లాఠీచార్జ్‌ను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది: వేముల మల్లేశ్

రంగారెడ్డి జిల్లా, శనివారం: జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు శాంతియుతంగా చేపట్టిన నిరసనపై పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్రమంగా అరెస్టులు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని రంగారెడ్డి జిల్లా పార్టీ అధికార ప్రతినిధి వేముల మల్లేశ్ వెల్లడించారు. శనివారం సాయంత్రం శివరాంపల్లిలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువత ఎంతో ఆశతో ఎదురుచూసిందన్నారు. అయితే ఫలితం లేకపోవడంతో ‘చలో అశోక్ నగర్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని నిరుద్యోగులపై...