బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు జర్నలిస్టుల అరెస్ట్
ఆదిలాబాద్/ బోథ్: బోత్ పట్టణంలో బ్లాక్‌మెయిలింగ్ చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో ఇద్దరు జర్నలిస్టులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గేమింగ్ యాక్ట్ కేసులో పట్టుబడ్డ వారి వివరాలు వార్తాపత్రికల్లో ప్రచురితం కాకుండా చూసేందుకు బాధితుడిని బెదిరిస్తూ రూ.6,000 డిమాండ్ చేసి, అందులో రూ.5,200 వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై బోత్ సీఐ డి. గురుస్వామి మాట్లాడుతూ—గత నెల 25వ తేదీన గేమింగ్ యాక్ట్‌లో పట్టుబడ్డ కేసు వివరాలు బయటకు రాకుండా ఉండాలంటూ ఇద్దరు వ్యక్తులు బాధితుడిని బెదిరించారని,...