గ్రామ అభివృద్ధి కోసం కదిలిన యువ సర్పంచ్
ఆదిలాబాద్/ ఇచ్చోడ, డిసెంబర్ 31 : జిల్లాలోనీ అడేగామా కే గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి యువ సర్పంచ్ కదం విశాల్ చురుగ్గా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలు, గ్రామంలో రేషన్ షాపు లేకపోవడం వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జిల్లా నీటిపారుదల శాఖ అధికారులను కలిసి, కాలువ ద్వారా చెరువుకు నీరు విడుదల చేసే విధంగా ఇప్పటివరకు నిర్మాణం చేసిన వ్యవస్థను వినియోగంలోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం...