షెడ్యూల్ ప్రాంత కేసులపై హైకోర్టు వ్యాఖ్యలు అభ్యంతరకరం

రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా న్యాయవ్యవస్థ వ్యవహరించాలి: ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్గుడిహత్నూర్, డిసెంబర్ 29, 2025: ఏజెన్సీ ప్రాంతాల్లో భూ బదలాయింపులను నిరోధించే LTR చట్టం ఉల్లంఘనలపై గౌరవ తెలంగాణ హైకోర్టులో జరిగిన కేసు వాదనల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరమని ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవ దౌలత్ రావు మొకాశి ఒక ప్రకటనలో తెలిపారు.ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల అంశంపై విచారణ సందర్భంగా...