గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
- మంత్రిమండలి కీలక నిర్ణయాలు- బీసీ రిజర్వేషన్లపై సమగ్ర చర్చఎన్నికలు వాయిదా పడితే నిధుల నిలుపుదల ప్రమాదం- ప్రజాపాలన విజయోత్సవాలకు భారీ ప్రణాళికహైదరాబాద్, 17 నవంబర్ :రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జరిగిన మంత్రిమండలి సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం, దానికి సంబంధించిన న్యాయపరమైన పరిణామాలు, గత తీర్మానాలు, గవర్నర్ వద్ద పెండింగ్, హైకోర్టు...