ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా బట్టబయలు – అమ్మాయిల గొంతు మార్చి లివింగ్ రిలేషన్షిప్ పేరుతో మోసాలు
ఆదిలాబాద్ : పట్టణంలో ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల నిజస్వరూపం బయటపడింది. అమ్మాయిల గొంతు మార్చి మాట్లాడుతూ, లివింగ్ రిలేషన్షిప్ పేరుతో డబ్బులు ఎగరేసుకుంటున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితులు వివిధ జిల్లాల్లో ప్రజలను మోసం చేస్తూ సేకరించిన డబ్బులతో ఖరీదైన మొబైల్ ఫోన్లు, బైక్‌లు కొనుగోలు చేసినట్లు తేలింది. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి నిందితుల వివరాలు:A1. మాలోత్ మంజి @ కృష్ణవేణి...