గుండాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ ఆపరేషన్ – 36 బైక్‌లు, 6 ఆటోలు, 2 ట్రాక్టర్లు స్వాధీనం

ఆదిలాబాద్ జిల్లా, అక్టోబర్ 29: ఆదిలాబాద్ జిల్లా SP శ్రీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు, ఉట్నూర్ అదనపు SP కాజల్ సింగ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఇచ్చోడ మండలం గుండాల గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో తగిన రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా ఉన్న 36 బైక్‌లు, 6 ఆటోలు, 2 ట్రాక్టర్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత అదనపు SP కాజల్ సింగ్ IPS  గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, పోలీసుల సేవలు ప్రజల శ్రేయస్సు...