గ్రూప్ 1ఫలితాలలో ఉత్తీర్ణులైన శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించిన జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ మల్లెపూల నర్సయ్య,
రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్ :మండలం లోని దేగామ గ్రామానికి చెందిన ఉయికే నాగేశ్వర్ దంపతుల కుమారుడు ఉయికే శ్రీనివాస్ గత నెలలో ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో ఉత్తీర్ణులై ఎంపీడీఓ గా నియామక పత్రం పొందారు. ఆ విషయాన్ని తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ తాను పుట్టి పెరిగిన ఆ గ్రామానికి తన సహచరులతో వెళ్ళి, నూతనంగా ఉద్యోగం పొందిన ఉహికే శ్రీనివాస్ ను వారి తల్లి దండ్రులను,శనివారం ఘనంగా సన్మానించారు. శ్రీనివాస్ గ్రూప్ l లోనే కాకుండా గ్రూప్ 2 ,కి...