‘ముసలి’ రోగాలు ‘యవ్వనం’లోకి! <br>
హెల్త్ న్యూస్ : ఒకప్పుడు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) అంటే 50, 60 ఏళ్లు దాటిన వృద్ధాప్యపు హద్దుల్లో సంక్రమించే వ్యాధులుగా భావించేవారు. కానీ కాలం మారింది. ఈ 'ముసలి రోగాలు' ఇప్పుడు ఏకంగా యవ్వనంపైనే దాడి చేస్తున్నాయి. 30 ఏళ్ల లోపు యువతలోనూ బీపీ, షుగర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఆధునిక జీవనశైలి పేరుతో అలవాటు చేసుకుంటున్న శారీరక శ్రమ లేమి, ఫాస్ట్‌ఫుడ్ వ్యసనం, విపరీతమైన మానసిక ఒత్తిడి – ఇవే ఈ అసాంక్రమిక వ్యాధుల (NCDs)కు ప్రధాన హేతువులుగా వైద్య...