తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ – ప్రభుత్వం జీవో జారీ

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాల (BC) రిజర్వేషన్‌ను 42 శాతం వరకు పెంచుతూ జీవో (G.O. Ms. No.9) విడుదల చేసింది.ఈ నిర్ణయం ప్రకారం గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌, జడ్పీటీసీ, వార్డులు వంటి అన్ని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించి బీసీ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. తాజాగా నిర్వహించిన సామాజిక-ఆర్థిక-విద్యా-ఉద్యోగ సర్వే ఆధారంగా బీసీ జనాభా 56.33 శాతం ఉందని గుర్తించిన...