కేరళలో ‘మెదడు తినే అమీబా’ భయాందోళన: 9 నెలల్లో 19 మ*రణాలు

రిపబ్లిక్ హిందుస్థాన్, హెల్త్ న్యూస్ :  కేరళ రాష్ట్రంలో 'మెదడు తినే అమీబా' అని పిలుచుకునే భయంకరమైన సూక్ష్మజీవి కారణంగా ఈ ఏడాది (2025)లో ఇప్పటి వరకు 61 నుంచి 69 మంది బాధితులు నమోదయ్యారు, అందులో 19 మంది మరణించారు. ఈ వ్యాధి ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలైటిస్ (PAM) అని పిలుస్తారు, ఇది నేగ్లేరియా ఫౌలేరి (Naegleria fowleri) అనే అమీబా వల్ల వస్తుంది. ఈ అమీబా మెదడు కణజాలాన్ని నాశనం చేసి, తీవ్రమైన మెదడు వాపును కలిగిస్తుంది, ఫలితంగా చాలా సందర్భాల్లో...