ఆదిలాబాద్‌ను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసుల కృషి : ఏఎస్పీ

గంజాయిపై ఉక్కుపాదం ఆదిలాబాద్ జిల్లా, సెప్టెంబర్ 10 : జిల్లాను గంజాయి రహితంగా మార్చే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. సిరికొండ మరియు నేరడిగొండ మండలాల్లోని వ్యవసాయ భూముల్లో 73 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొక్కల మొత్తం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 6.4 లక్షల రూపాయలు.సిరికొండ మండలం నారాయణపూర్ గ్రామంలో సేడం దేవరావు (40) తన మక్క, సోయా చేనులో 66 గంజాయి మొక్కలను చట్టవిరుద్ధంగా పండిస్తుండగా, నేరడిగొండ మండలం గజిలి గ్రామంలో పెందుర్ సీతాబాయి...