తెలుగు రాష్ట్రాల్లోభారీ వర్షాలు..! – పలు రైళ్లు రద్దు..!

హైదరాబాద్,ఆగస్టు 28 : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి,ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.బుధవారం కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది,నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేటలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భువనగిరి, ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.వరదల ప్రభావిత...