అదిలాబాద్‌లో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్: వాహనాలు, లిక్కర్, గంజాయి స్వాధీనం

అదిలాబాద్ జిల్లా, ఆగస్టు 24: స్థానిక కెఆర్‌కె కాలనీలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 200 మంది పోలీసు సిబ్బంది, 40 మంది మహిళా పోలీసులతో జరిగిన ఈ తనిఖీలో 70 ద్విచక్ర వాహనాలు, 15 ఆటోలు, 1 కారు స్వాధీనం చేశారు. నార్కోటిక్ డాగ్ రోమా సహాయంతో 3 గంజాయి మొక్కలు (1 అడుగు ఎత్తు), 10 గ్రాముల...