విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి

• సోషల్ వర్కర్ ముబారక్ ఇచ్చోడ: మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో వరద నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పాఠశాలలో సానిటేషన్ నిర్వహించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సోషల్ వర్కర్ ముబారక్ గ్రామపంచాయతీ ఈఓ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో కోతుల బెడద, కుక్కల బెడద ఎక్కువైందని పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులపై కోతులు దాడి చేయడంతో విద్యార్థినులు ప్రమాదానికి గురవుతున్నారని అన్నారు. మండల కేంద్రంలో కోతుల బెడద, కుక్కల బెడదను నివారించడానికి...