ఆదిలాబాద్‌లో మహిళపై అ*త్యాచారం, దోపిడీ, హత్యాయత్నం కేసు – నిందితుడు అరెస్ట్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ - క్రైమ్ : ఆదిలాబాద్ పట్టణంలో ఈనెల 8వ తేదీన మహిళ యాచకురాలిపై అత్యాచారం, దోపిడీ, హత్యాయత్నానికి పాల్పడిన గుడిహత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కూలీ పని చేసుకునే నిందితుడు మాడవి నగేష్ @ నాగోరావు @ నాగేశ్వర్ (25) ను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులు సోమవారం రోజు ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరానికి పాల్పడిన విషయం ధృవీకరించబడిందనీ తెలిపారు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచనల మేరకు ఎలాంటి...