లయన్ ఫిట్నెస్ జిమ్ లో డ్రగ్స్ , స్టెరాయిడ్స్ స్వాధీనం – జిమ్ సీజ్ <br><br>
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ ఆదేశాల మేరకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలియజేశారు. గురువారం ఆదిలాబాద్ పట్టణం లోని నడిబొడ్డున వినాయక చౌక్ ప్రాంతం నందు లయన్ జిమ్ నిర్వాహకుడు మరియు నిందితుడు అయిన షేక్ ఆదిల్ చట్ట వ్యతిరేకంగా డ్రగ్సును తీసుకుంటూ మరియు స్టెరాయిడ్స్ ను జిమ్కు వచ్చే వారికి అందజేస్తున్నానే అభియోగం తో నిన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్...