ప్రభుత్వ రోడ్డును కబ్జా చేసిన కేసులో నకిలీ పత్రాల సృష్టి – ఇద్దరు అరెస్టు
అదిలాబాద్ జిల్లా, జూలై 16 : నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, చలాన్లు సృష్టించి ప్రభుత్వ రోడ్డును అక్రమంగా కబ్జా చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదైంది. ఇందులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించారు. ఈ విషయాన్ని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి వెల్లడించారు.శాంతినగర్‌కు చెందిన ఫిర్యాదుదారు కౌటివార్ సుశీల్ (63) ఆస్తి సంబంధిత మోసాలపై ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగినేని సూర్యప్రకాశ్ రావు, ఆయన కుమారుడు రంగినేని శ్రీనివాస...