ఆదివాసి మహిళ అనుమానాస్పద మృతి పై సమగ్ర విచారణ చేపట్టాలీ 

విషయం బయటకు పొక్కకుండా ప్రయత్నించిన గుత్తేదారు పై ఎస్ సి/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి - - ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి డిమాండ్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో అనసూయ బాయి అనే ఆదివాసి మహిళ తన బ్రతుకు తెరువు కొరకు పలువురి ఇండ్లలో పాచి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న తరుణంలో నిన్నటి (19/05/2025) రోజున ఒక గుత్తేదారు ఇంట్లో పాచి పనులకు వెళ్ళి అనుమానాస్పదంగా మృతి...