లచింపూర్(బి) లో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: సిరికొండ మండలంలోని లచింపూర్(బి) గ్రామంలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్, శాస్త్రవేత్తలు, ఉద్యాన శాస్త్రవేత్త, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి, ఉద్యానవన అధికారి, మాజీ ఎం.పి.పి., మాజీ సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీతో పాటు అధిక సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డా. శ్రీధర్ చౌహాన్, అసోసియేట్ డీన్, వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్ మాట్లాడుతూ, వ్యవసాయంలో తక్కువ యూరియా వాడకం, అవసరానికి...