రాంజీ గోండు స్పూర్తితో ఉద్యమాలు కోనసాగిస్తాం — ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి

రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్ : బుధవారం రోజు గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ విజ్ఞాన కేంద్ర ఆవరణలో మర్సకోల రాంజీ గోండ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివాసి సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారిపై 1857 సిపాయిల తిరుగుబాటును ఆదర్శంగా తీసుకొని 1858...