భారీ ఎన్కౌంటర్: 20 మంది నక్సల్స్, పోలీసు మృతి

హైదరాబాద్ :  పొరుగున గల ఛత్తీస్గఢ్ అడవుల్లో నక్సల్స్, పోలీసుల మధ్య మరోసారి భీకర పోరు జరుగుతోంది. ఇరువర్గాల మధ్య గురువారం ఉదయం ఏడు గంటల నుంచి జరుగుతున్న భారీ ఎదురుకాల్పుల ఘటనలో 20 మంది మావోయిస్టు నక్సల్స్, మరో జవాన్ మరణించినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. దంతెవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని గంగలూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.గంగలూరు సమీపంలోని ఆండ్రి అడవుల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో తమ బలగాలను పంపినట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ స్థానిక...