సరిహద్దుల్లో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
జైనథ్ సర్కిల్ కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. పిప్పర్ వాడ,పెన్ గంగా, బోరజ్ చెక్పోస్టులను పరిశీలించిన జిల్లా ఎస్పీ. సుప్రసిద్ధ జైనథ్ లక్ష్మీనారాయణ ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహణ. అదిలాబాద్: జిల్లాకు నూతనంగా విచ్చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తనదైన శైలిలో జిల్లాలో ఆకస్మిక పర్యటనలతో పోలీసు యంత్రాంగం చేస్తున్న విధులను పరిశీలించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు జైనథ్ పోలీస్ స్టేషన్ను, అదేవిధంగా సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. సిబ్బంది చేస్తున్న విధులను,...