ఏడాదిలో ఎన్ని హామీలు అమలు చేయగలిగారు!?
-ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9640466464మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. అమలు చేయగలిగే హామీలు, గ్యారంటీలు మాత్రమే ఇవ్వాలని, ప్రణాళిక లేని హామీలు బడ్జెట్ పై భారం వేయడమే కాకుండా, పార్టీ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని చెప్పడంపై ప్రధాని మోడీ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని, ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని ‘ఎక్స్’లో పోస్ట్...