చిన్నారి వైద్యానికి రూ.50వేలు ఆర్థిక సాయం నగదును అందజేసిన సభావత్ శ్రీనివాస్ విజయ ట్రస్ట్ సభ్యులు

ఇచ్చోడ : మండలంలోని జల్దా  గ్రామానికి చెందిన అల్లెం రాములు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఆయన కుమార్తె అల్లెం రమకుమారి ఇచ్చోడ విద్యాలయ పాఠశాలలో ఆరోతరగతి చదువుతోంది. ఇటీవల ఉన్నట్టుండి స్పృహా తప్పి పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ లోని రిమ్స్ కు తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు వివిధ ఆస్పత్రుల్లో వైద్యం చేయించిన నయం కాకపోవడంతో ప్రస్తుతం నిజామాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతుంది. పరీక్షించిన వైద్యులు చిన్నారి...