కాకి ని  “కాలజ్ఞాని” అని ఎందుకు అంటారు…!

వేకువ జామునే "(బ్రహ్మ ముహూర్తంలో)" మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి."కావు కావు" అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు... ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతమూ "కావు కావు" అని  అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి.ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న "అన్ని కాకులకు" సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి  ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి.శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి "సంఘటితంగా...