Khammam Rains: ఖమ్మం జిల్లాల్లో కుండపోత వర్షం.. బిక్కు బిక్కు మంటున్న జనం..!!

మొన్నటి వరకు భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. ముఖ్యంగా ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేటలో అత్యంత భారీ వర్షాలతో ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక నష్టం కూడా సంభవించింది.అయితే ఈ జిల్లాలను ఇంకా వర్షాలు వదలడం లేదు. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కుంభ వృష్టి వర్షం కురిసింది. దీంతో ఈ జిల్లాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు.శనివారం సాయంత్రం నుంచి మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఉరుములతో కూడిన...