33 జీవో తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం – ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్ : మెడికల్ అడ్మిషన్ల కోసం రేవంత్ సర్కార్ తీసుకొ చ్చిన జీవో 33పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ జీవోతో తెలంగాణ విద్యా ర్థులు నాన్ లోకల్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఏ అంశంపైన కూడా కనీస అవగాహన లేని ప్రభుత్వం.. అడ్డదిడ్డంగా పాలన సాగిస్తోందన్నారు. చివరి నాలుగేళ్లు తెలంగాణలో చదివితే లోకల్ గానే పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. పొరపాటున మన పిల్లలు బయటకు వెళ్లి రెండేళ్లు చదివితే వారి పరిస్థితి ఏంటని నిలదీశారు. ప్రభుత్వానికి చేతకాకపోతే...