History : స్వర్ణముఖి నది పై ప్రత్యేక కథనం

ఆంధ్రప్రదేశ్ తిరుపతి :  తిరుపతి-చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. ధూర్జటి తన రచనల్లో దీన్ని మొగలేరు అని ప్రస్తావించాడు.ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తీశ్వరాలయం,తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం,యోగి మల్లవరం వద్దనున్న పరాశరేశ్వరాలయం,గుడిమల్లం దగ్గరున్న పరశురామేశ్వరాలయం, గాజులమండ్యం దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి.ఇది జీవనది కాదు.సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది.ఈ నది భీమ, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.ఈ నదిని గురించి ఒక పురాణగాథ ఉంది.పూర్వం...