అణిముత్యం: మాదాపూర్‌ పోలీస్ స్టేషన్ పై  ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎస్సై

హైదరాబాద్‌:ఏప్రిల్ 06సైబరాబాద్‌ పోలీస్‌ కమిష నరేట్‌ పరిధిలోని మాదా పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏసీబీ అధికా రులు దాడులు నిర్వహిం చించారు.ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్‌, రైటర్‌ విక్రమ్‌ ఏసీబీ పోలీసులకు రెడ్‌హ్యాండె డ్‌గా పట్టుబడ్డారు.వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసు లు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు. మాదా పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు.ఇందులో భాగంగా ఎస్సై, రైటర్‌ అవినీతి వ్యవహారం బయటపడినట్లు సమాచారం...