తెల్లారితే పెళ్లి…. అంతలోనే తేరుకొని విషాదం…

జోగిపేట : తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు 30 మంది బంధువులు ఒకే ట్రాక్టర్‌లో బయల్దేరగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. డ్రైవర్‌ మినహా మిగతావారికి గాయాలయ్యాయి. జోగిపేట ఎస్సై అరుణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన సొంగ రమేశ్‌కు సంగారెడ్డి జిల్లా అందోలుకు చెందిన మమతతో...