నేను మలాలా కాదు.. భారత్‌లో సురక్షితంగా ఉన్నా

ప్రపంచవేదికపై భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌ ప్రచారాన్ని కశ్మీర్‌ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ యానా మీర్‌ తీవ్రంగా ఖండించారు. బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన సంకల్ప్‌ దివాస్‌ కార్యక్రమంలో యానా మీర్‌ ప్రసంగించారు. భారత్‌లో అంతర్భాగం అయిన కశ్మీర్‌లో తనకు​భద్రత, స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో పాకిస్తాన్‌ భారత్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని యానా మీర్ తిప్పికొట్టారు. భారతదేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నా.. భారతదేశంలో అంతర్భాంగా ఉన్న నా మాతృభూమి కశ్మీర్‌లో ఉన్నా. నేను ఎప్పుడూ అక్కడి నా దేశం నుంచి...