మోడీ కీలక నిర్ణయం.. సందేశ్‌ఖాలీ బాధిత మహిళలతో భేటీ!

సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోడీ (PM Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ఆయా రాష్ట్రాల్లో తిరుగుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ బిజిబిజీగా గడుపుతున్న ప్రధాని.. తాజాగా సందేశ్‌ఖాలీ బాధితులను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పశ్చిమబెంగాల్‌లోని (West Bengal) సందేశ్‌ఖాలీ (Sandeshkhali) ఆందోళనలతో అట్టుడుకుతోంది. తమపై అత్యాచారం జరిగిందంటూ కొందరు మహిళలు బహిరంగంగా ఆరోపించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా బీజేపీ నేతలు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ...